టాలీవుడ్ లో న్యూజెన్ కామెడీ చిత్రాలు తీయడంలో ముందు వరుసలో ఉండే దర్శకుడు రవిబాబు. తనదైన వైవిధ్యమైన శైలిలో అన్ని జోనర్స్ ను కవర్ చేసే ఈ దర్శకుడు ఈ కరోనా కాలంలో కూడా ఒక లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నాడు . సినిమా పేరు ‘క్రష్’ . కరోనా ఇండియా లో బిగిన్ అయిన టైమ్ లోనే కరోనా బ్యాక్ డ్రాప్ లోనే తన చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళిన రవిబాబు.. కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు ఇంతవరకూ బ్రేక్ నిచ్చాడు. ఇటీవల ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో.. రవిబాబు తన క్రష్ చిత్రాన్ని ఈరోజే సెట్స్ మీదకి తీసుకెళ్ళారు. అంతేకాదు లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన మొట్ట మొదటి చిత్రంగా ‘క్రష్’ చిత్రం విశేషాన్ని సంతరించుకుంది.
దర్శకుడు రవిబాబు తన ‘క్రష్’ చిత్రం షూటింగ్ మొదలు పెట్టిన సందర్బంగా… తాను తీయబోయే సీన్ గురించి వివరించి అందరికీ షాకిచ్చారు. హీరో, హీరోయిన్స్ ఇద్దరూ గట్టిగా కౌగిలించుకొనే సీన్ చిత్రీకరించి యూనిట్ సభ్యుల్ని ఆశ్చర్యపరిచారు. దాంతో ప్రభుత్వం ఆదేశించిన రీతిలో రవిబాబు సినిమా షూటింగ్ చేయడం లేదేమోనని ఎవరికైనా సందేహం కలగకమానదు. అయితే రవిబాబు .. ప్రభుత్వ ఆదేశాల్ని ఖచ్చితంగానే పాటించారని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.
After #lockdownindia first movie to start shooting is Director #RaviBabu 's #Crrush
And his first shot was a hug scene between hero and heroine.
Watch out for his mark!#StaySafe#IndiaFightsCoronavirus pic.twitter.com/u40VFLcA5u
— BARaju (@baraju_SuperHit) June 13, 2020