అతడి ప్రస్తుత వయసు 33. సరిగ్గా పదేళ్ళ క్రితమే సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.  ఆపై హీరోగా కూడా ఎదిగాడు. ఇప్పుడు టాప్ యంగ్ హీరోల లిస్ట్ లో చేరాడు. అతడి పేరు జీ.వీ.ప్రకాష్ కుమార్ . మేనమామ ఎ.ఆర్.రహమాన్ వరల్డ్ క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ . తనకు ఊహ తెలిసిన దగ్గరనుంచి .. ఆయనతోనే ఎక్కువగా కలిసి ప్రయాణించడంతో ..  సంగీత జ్ఞానం కూడా బాగానే ఒంటపట్టింది.

ప్రకాష్ మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు. ఇంకా రెహమాన్ ఇతర ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు. తర్వాత కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ తో కలిసి పనిచేశాడు. అన్నియన్ (తెలుగులో అపరిచితుడు), ఉన్నాళే ఉన్నాళే అనే రెండు సినిమాల్లో పాటలు పాడాడు. ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. ఆ తరువాత ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన మదరాసు పట్టణం అనే సినిమాకు ఇతను కూర్చిన సంగీతం కూడా ఆకట్టుకున్నది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయాక్కం ఎన్న అనే సినిమా ధనుష్ హీరోగా ప్రకాష్ కి మూడో సినిమా. ఈ సినిమా సంగీతం కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ తర్వాత తెలుగులో కూడా డార్లింగ్ లాంటి పలు చిత్రాలకు సంగీతం అందించాడు జీవి.   2013 లో జి. వి. ప్రకాష్ కుమార్ ప్రొడక్షన్స్ పేరుతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు ప్రకాష్ . ఈ సంస్థ మొట్టమొదటి సినిమా, బాలు మహేంద్ర దగ్గర సహాయకుడుగా పనిచేసిన విక్రం సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మద యానై కూట్టం. 2012 లో దర్శకుడు మురుగదాస్  తన సినిమాలో నటించమని అడిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. తరువాత ప్రకాష్ మూడు సినిమాల్లో నటించడానికి అంగీకరించాడు. ఆడుకాలం నరేన్ దగ్గర నటనలో శిక్షణ పొందాడు. తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ సినిమాకు రీమేక్ అయిన డార్లింగ్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం తమిళ  టాప్ యంగ్ హీరోల్లో ఒకరుగా సత్తా చాటుకుంటున్నాడు జీవీ. నేడు జీవి ప్రకాష్ కుమార్ బర్త్ డే . ఈ సందర్భంగా ఆ యువ తరంగానికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!