ఆయన సంగీతంలో… మైకంలో ముంచేటి మత్తుంది. ఎన్నిసార్లైనా వినాలనే మహత్తుంది. ఆయన రాగాలలో ఏదో తెలియని గమ్మత్తుంది. వైవిధ్యమైన బాణీలతో .. పెక్యులర్ వాయిస్ తో .. ఆయన అందించే పాటలు అప్పటి ప్రేక్షకుల్ని భలేగా ఆకట్టుకున్నాయి. పేరు రమణ గోగుల . ఎప్పుడూ గుండుతో.. చేతిలో గిటార్ తో .. బుర్రలో బోలెడన్ని ఆలోచనలతో కనిపించే ఆయన టాలీవుడ్ లో పలు చిత్రాలకు అద్భుతమైన బాణీలందించి సత్తా చాటుకున్నారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ చాలా చిత్రాలకు రమణ గోగులనే స్వరాలు కూర్చి.. అన్ని పాటల్నీ సూపర్ హిట్టుగా మలిచారు.

రమణ గోగుల  ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  నుండి మెకానికల్ ఇంజనీరింగ్ ఎం.టెక్ తో పాటు బాటన్ రూజ్‌లోని లూసియానా స్టేట్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్సులో ఎం.ఎస్  చేసారు. ఎంఎన్‌సి సైబేస్ కోసం దక్షిణాసియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. సంగీతం మీద మక్కువతో ఆయన పని చేసే ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. సొంతం గా ఒక మ్యూజిక్ ట్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు.  1996 లో రమణ గోగుల సంగీత  బృందం మిస్టి రిథమ్స్, ఇండీ పాప్‌ను స్టూడియో ఆల్బమ్ అయే లైలాతో పాటు మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఇది భారతదేశంలోని  MTV, ఛానల్, వి ఛానల్  వంటి ప్రధాన సంగీత ఛానెళ్లలో చార్ట్ బస్టర్‌గా మారింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి, మూడు దక్షిణ భారత భాషలలో ఎన్నో హిట్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. వెంకీ ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రంతో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన రమణ గోగుల .. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వరకూ దాదాపు 25 చిత్రాలకు సంగీతం సమకూర్చి.. తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. అలాగే సుమంత్ హీరోగా బోణీ అనే చిత్రాన్ని నిర్మించారు . నేడు  రమణ గోగుల బర్త్ డే . ఈ సందర్భంగా ఆ సంగీత మాంత్రికుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

 

 

Leave a comment

error: Content is protected !!