శివ’లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ తీసి టాలీవుడ్ కు దశా నిర్దేశం చేసిన క్రియేటివ్ జీనియస్ రామ గోపాల్ వర్మ .. ఇప్పటి తరం యువతకు తన బూతు కంటెంట్ సినిమాలతో వల వేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిన్నటికి నిన్నే ఏటీటీ కాన్సెప్ట్ తో క్లైమాక్స్ అనే సినిమా తీసి.. దాదాపు రూ. 3కోట్లను మూటగట్టుకొన్న వర్మజీ… ఇప్పుడు మరో సినిమా తో యూత్ ను ఎట్రిక్ట్ చేసే ప్రయత్నం ప్రారంభించాడు. సినిమా పేరు ‘నేకెడ్’. పేరుకు తగ్గట్టుగానే ఇందులో నగ్నత్వం పుష్కలంగా ఉందనిపిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఆ సంగతి నిజమే అనిపించకమానదు.

క్లైమాక్స్’ కంటే మించి రెచ్చగొట్టేలా ఉన్న ఈ ‘నేకెడ్ ’ టీజర్ చూస్తే ఇంత వరకు ఏ డైరక్టర్ కూడా లేడీస్ పై ఈ యాంగిల్ లో కెమెరా పెట్టలేదని చెప్పవచ్చు. ఆ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి మొహం కనిపించకుండా కేవలం ఆమె లోవర్ బాడీ పార్ట్స్ అయిన తొడల మీద కాళ్ళమీద ఫోకస్ పెట్టాడు. ఇక  ‘క్లైమాక్స్’ సినిమాకు వంద రూపాయలు పెట్టిన వర్మ ఈసారి మాత్రం రెండు వందల రూపాయలను టికెట్ ధరగా నిర్ణయించాడు. ఆడవారిని నేను రెట్టింపు ఆరాధిస్తాను కాబట్టి రెట్టింపు ధర ఫిక్స్ చేశానని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ఈ సినిమా  కూడా ‘క్లైమాక్స్’ సినిమా మాదిరిగానే ఆర్జీవీ వరల్డ్ లో రిలీజ్ కాబోతోందని ప్రకటించారు. మరి ఈ చిన్న సినిమాని 200 రూపాయలు పెట్టి ఎంతమంది చూస్తారో చూడాలి.

ట్రైలర్ వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=65&v=lWwsFh4vttE&feature=emb_logo

 

 

Leave a comment

error: Content is protected !!