నటసింహ నందమూరి బాలకృష్ణ .. సినిమా డైలాగ్స్ ను తూటాల్లా పేల్చడమే కాకుండా… అడపా దడపా పాటల్ని కూడా పాడుతుంటారు. ప్రత్యేకించి తన రేపు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన తండ్రి యన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం జగదేకవీరుని కథ లోని శివ శంకరీ పాటను పూర్తిగా ఆలపించి అభిమానులకు షాకిచ్చారు. ఘంటసాల మాస్టారు ఆలపించిన ఆ స్వర భూయిష్టమైన పాటను పాడడానికి ఎలాంటి ప్రొఫెషనల్ సింగర్ అయినా.. కాస్తంత కష్టపడుతుంటాడు. కానీ  బాలయ్య మాత్రం ఆ పాటను ఎంతో  అలవోకగా ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఎలాంటి పాటనైనా పాడడానికి కొంచెమైనా జంకని బాలయ్య బాబు .. తీసుకున్న టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు.  ఈ సాంగ్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  ఎన్బీకె ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయిన ఈ పాట అభిమానుల్నే కాకుండా.. అందరినీ అలరిస్తూండడం విశేషం.

పాటను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=xfp28LIjliE&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!