జయాపజయాలతో సంబంధం లేకుండా .. ఎప్పటికప్పుడు కాంటెంపరరీ అంశాలతో సినిమాలు తీసేయడం రామ్ గోపాల్ వర్మకు ఫిల్మ్ తో పెట్టిన విద్య. అదే సమయంలో తన సినిమాలకు పైసా ఖర్చులేకుండా పబ్లిసిటీ తెచ్చుకొనే విద్యలో ఆయన ఆరితేరిపోయారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొంది.. ఏటీటీ (ఎనీటైమ్ థియేటర్ ) పద్ధతిలో పేటూ వ్యూ ప్రాసెస్ లో విడుదల చేసిన చిత్రం ‘క్లైమాక్స్’. అంతకు ముందు ఆయన ‘జియస్టీ’ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించి ప్రేక్షకులకి షాకిచ్చిన మియా మాల్కోవా క్లైమాక్స్ లో హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ‘సినిమా ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ఓపెన్‌’ అంటూ వర్మ ట్విట్టర్‌లోనూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. రూ.100 పెట్టి సినిమా చూడాలని పోస్టర్ రిలీజ్ చేసిన వర్మ.. అన్నట్లుగానే జూన్ 6న, శనివారం రాత్రి 9గంటలకు క్లైమాక్స్ సినిమాను ఆన్‌లైన్ వేదికగా విడుదల చేశారు.

నెటిజన్లు ఓ రేంజ్‌లో బుకింగ్స్ చేసుకోగా.. అనుకున్న దానికంటే ఎక్కువమందే ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో సర్వర్ ఓవర్ లోడ్ కావడంతో క్రాష్ అయ్యింది. ఈ నేపథ్యంలో వర్మ.. తాను అనుకున్నట్లే సినిమా సక్సెస్ అయ్యిందని తన దైన స్టైల్‌లో స్పందించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్ ను వర్మ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. క్లైమాక్స్ చిత్రానికి అనుకున్నదానికన్నా ఎక్కువగానే కలెక్షన్స్ వచ్చిపడడం విశేషం. ఈ సినిమాని  36 గంటల్లో ఏకంగా 2,23,503 మంది తిలకించారట. అంటే.. ఈ లెక్కన ఈ సినిమాకు రెండు కోట్ల కు పైగానే కలెక్షన్స్ వచ్చాయన్నమాట.

 

Leave a comment

error: Content is protected !!