టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ ఫాలోయింగే వేరు. పెర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ .. జోవియల్ యాక్టింగ్ .. ఎలాంటి పాత్రమైనా అవలీలగా పోషించే సత్తా.. వైవిధ్యమైన పాత్రల్ని ఎంపిక చేసుకోవడం.. ఇవన్నీ వెంకీని టాలీవుడ్ లో లాంగ్ స్టాండ్ లో హీరోగా నిలిపాయి.  ‘ఎఫ్ 2’ తో లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్టందుకొన్న వెంకీ ప్రస్తుతం ‘నారప్ప’ లో కొడుకును కోల్పోయిన  తండ్రిగా రివెంజ్ తీర్చుకొనే పాత్రలో  నటిస్తున్నారు. ఇవన్నీ పక్కనపెడితే.. ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఇన్ స్టా గ్రామ్ ఖాతాకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.

విక్టరీ వెంకటేశ్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 1మిలియన్ మార్క్ ను టచ్ చేసింది. లేటేస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో , వాటి ఫోటోస్ తో ఎప్పటికప్పుడు అభిమానుల్ని అలరించే ఆయన ఆ స్థాయిలో ఫాలోవర్స్ సంపాదించుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. వెంకటేశ్ దగ్గుబాటి అనే పేరుతో  ఉన్న ఆయన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ .. ఇంకెంత స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చుకుంటుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!