చెప్పలేనంత చెలాకీ తనం.. కాస్తం కొంటెతనం.. రవ్వంత చిలిపితనం .. చేతల్లో కుర్రతనం.. కలిస్తే తొట్టెంపూడి వేణు. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని తొలి చిత్రం ‘స్వయంవరం’ తోనే పొందిన అరుదైన కథానాయకుడు ఆయన. తన చిత్రాలతో ప్రేక్షకుల్ని నవ్వించడమే పనిగా పెట్టుకొని .. పనిగట్టుకొని మరీ పొట్టచెక్కలు చేయించిన ఘనత అతడిది.

 హైదరాబాద్‌లో పుట్టిన వేణు ధార్వాడలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం నటనపై దృష్టిపెట్టారు. భారతీరాజా దర్శకత్వంలో తొలి సినిమా మొదలైనా.. ఆ తర్వాత ప్రొడక్షన్‌ సమస్యల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. తన స్నేహితుడు వెంకట శ్యామ్‌ప్రసాద్‌ స్థాపించిన ఎస్‌.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘స్వయంవరం’ చేశారు. కె.విజయభాస్కర్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఆయనకి ఘన విజయాన్ని అందించింది. ఆ వెంటనే ‘చిరునవ్వుతో’ సినిమాతో మరో విజయాన్ని అందుకొన్నారు. ఆపై ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాలతో వేణు పేరు మార్మోగిపోయింది. ప్రధాన కథానాయకుడిగా పేరు తెచ్చుకొన్నారు. అయితే ఆ తర్వాత సరైన విజయం దక్కలేదు ఆయనకి. ‘చింతకాయల రవి’, ‘దమ్ము’ చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిశారు. కానీ వేణుకి మాత్రం పెద్దగా పేరు తీసుకురాలేదు. ‘రామాచారి’ తర్వాత ఆయన సినిమాలకి దూరంగా ఉన్నారు. త్వరలో ఒక ప్రముఖ దర్శకుని చిత్రంలో వేణు ఒక ప్రధాన పాత్ర తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారట. నేడు వేణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే వేణు

 

 

Leave a comment

error: Content is protected !!