గత నెలలో దగ్గుబాటి రానా సోషల్ మీడియా సాక్షిగా తన ప్రేమగుట్టును విప్పిన సంగతి తెలిసిందే. తాను వలచిన సుందరి తన ప్రేమకు అంగీకారం తెలిపిందని ట్విట్టర్ లో అందరికీ తెలియచేసి పెద్ద షాకిచ్చాడు. ఉభయ కుటుంబాల వారు వారి ప్రేమను అంగీకరించి.. పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేకాదు .. అతి కొద్ది మంది సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్ధాన్ని కూడా జరిపించేశారు.  ఇప్పుడు పెళ్ళి ఎప్పుడనే ఆసక్తి అంతటా నెలకొంది . అయితే కేవలం రెండు నెలల్లోనే  వారిద్దరి పెళ్ళి జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి రానా, మిహికా  ప్రేమ విషయం తెలియగానే రానా తండ్రి, నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆఖరు నాటికి పెళ్లి వేడుకలు పూర్తి చెయ్యాలనుకుంటున్నట్లు తెలియజేశారు. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మరో రెండు నెలల్లోనే దగ్గుబాటి వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకోని తమ పెళ్లిని చాలా నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట రానా – మిహీకా. ఇందుకోసం ఆగస్టు 8న ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. వివాహ వేడుక హైదరాబాద్‌లోనే జరగనుంది. పెళ్లి వేదిక ఎక్కడ? నిశ్చితార్థం ఎప్పుడు? వంటి విషయాలపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ వేడుకకు తమ ఇరు కుటుంబాల్లోని అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

error: Content is protected !!