ఎలాంటి పాత్రనైనా సమర్ధవంతంగా పోషించి, మెప్పించగలగడంలో దిట్ట యంగ్ టైగర్ యన్టీఆర్. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ క్రేజీ మల్టీస్టారర్ మీద మెయిన్ ఫోకస్ పెడుతున్నాడు.  స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో పీరియాడికల్ ఫిక్షనల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ కొమ్రం భీమ్ గా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇదే తరహాలో తారక్‌ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్నారట ‘కే.జీ.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, త్రివిక్రమ్‌ చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌ చెయ్యబోయే కొత్త సినిమా ప్రశాంత్‌ దర్శకత్వంలో ఉండనున్నట్లు ఇప్పటికే ఖరారైంది.

పాన్‌ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ దీన్ని నిర్మించబోతుంది. ఇప్పుడీ చిత్ర కథాంశానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దీన్ని కూడా ఓ చక్కటి పీరియాడిక్‌ డ్రామా కథాంశంగానే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారట ప్రశాంత్‌. ఇప్పటికే ఆ కథను తారక్‌కు కూడా వినిపించడం జరిగింది. పస్తుతం తన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కెజిఎఫ్‌ 2’ చిత్రీకరణ పూర్తికాగానే ఎన్టీఆర్‌ సినిమా స్క్రిప్ట్‌ పనిని ప్రారంభించనున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలో ఇది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

 

 

Leave a comment

error: Content is protected !!