దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్  ‘బాహుబలి’ సిరీస్ . ది బిగినింగ్, ది కంక్లూజన్ సాధించిన వసూళ్ళ ప్రభంజనం అంతా ఇంతా కాదు. కేవలం ఇండియాలోనే కాకుండా..  ప్రపంచంలోని ప్రధానమైన కొన్ని దేశాల్లో కూడా ‘బాహుబలి’ సత్తా చాటుకుంది. ఇప్పుడు మరోసారి ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. 

అదేంటంటే.. రష్యా దేశంలోని ఓ టెలివిజన్‌ ఛానెల్..  రష్యన్‌ వాయిస్‌ ఓవర్‌తో ‘బాహుబలి2’ చిత్రాన్ని ప్రసారం చేసింది. అదే విషయాన్ని రష్యన్‌ ఫెడరేషన్‌ రాయబార ఇండియా కార్యాలయం తన అధికారిక ట్విట్టర్లో పెట్టింది. అంతే కాదు..‘‘భారతీయ సినిమా రష్యాలో ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం రష్యన్‌ టీవీ ప్రసారం చేస్తున్న వీడియోను చూడండి అంటూ..’’పేర్కొంది. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ అనే కళాఖండం మనదేశ చిత్రసీమ గొప్పతనాన్ని చాటిచెబుతూనే ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

Leave a comment

error: Content is protected !!