ప్రస్తుతం ఏ భాషలోని చిత్రమైనా .. అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించడంలో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఒక యాక్షన్ మూవీ రష్యన్ భాషలోకి అనువాదమవుతూండడం సౌత్ లో హాట్ టాపిక్ అయింది. ఆ సినిమా పేరు ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ విలన్ గా నటించాడు. ఒక కాలేజీ విద్యార్ధి హత్యకు గురవుతాడు. అతడ్ని ఎవరు చంపారు అనేది పోలీసులకు సవాల్ గా మారుతుంది. అయితే ఆ కాలేజ్ లోని ఒక ప్రొఫెసర్ ఈ హత్యచేసిన వారిని పట్టించడమే ఈ సినిమా కథాంశం.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. 2017లో విడుదలైన ఈ సినిమా మమ్ముట్టి సినీ కెరీర్ లోనే హైయస్ట్ గ్రాసర్ గా నిలిచిపోయింది. మొత్తం మీద మొట్టమొదటి సారిగా ఒక మలయాళ చిత్రం రష్యన్ భాషలోకి అనువదించనుండడం విశేషంగా మారింది. ఈ విషయాన్ని దర్శకుడు అజయ్ వాసుదేవ్ సోషల్ మీడియా లో ప్రకటించాడు.

 

 

Leave a comment

error: Content is protected !!