విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం తెలుగులో ఏ రేంజ్ లో వసూళ్ళు కురిపించిందో తెలిసిందే. పిచ్చైక్కారన్ గా తమిళంలో రిలీజైన నెలలోనే తెలుగులోనూ విడుదలై.. రెండు చోట్లా దుమ్ము రేపేసింది. అందుకే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడు విజయ్. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఎప్పుడో మొదలైంది. ఈ సినిమా కోసం విజయ్ ఆంటోనీ ఏకంగా రైటర్ గా మారుతున్నాడు.

తాజాగా విజయ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘నాలుగు నెలల నుంచి సీక్వెల్‌ కోసం స్ర్కిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నాను. స్ర్కిప్టుకి తుదిమెరుగులు పెడతున్నాం. త్వరలోనే తారాగణంతో పాటు సాంకేతివర్గాన్ని వెల్లడిస్తానని’’ చెప్పాడు. మొదట్లో వచ్చిన ‘పిచ్చైక్కారన్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన శశి ప్రస్తుతం వేరే చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రాబోయో సీక్వెల్‌ చిత్రానికి సంగీతం కూడా విజయ్‌ ఆంటోనినే చేపట్టనున్నాడట. విజయ్‌ ఆంటోని ప్రస్తుతం ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగల్‌’, ‘ఖాకీ’ చిత్రాలతో పాటు మరో మూడు సినిమాల్లోను నటించనున్నాడు.

 

Leave a comment

error: Content is protected !!