నటసామ్రాట్ అక్కినేని సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. అయితే అందులో కొన్ని చిత్రాలు .. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఓ అద్భుతమైన కథాబలం కలిగిన చిత్రం ‘అంతస్తులు’. జగపతి ఆర్ట్స్ బ్యానర్ పై వి.బీ.రాజేంద్రప్రసాద్ నిర్మాణ సారధ్యంలో వి.మధుసూదనరావు మలిచిన ఈ కుటుంబ కథాచిత్రం 1965, మే 27న విడుదలైంది. సరిగ్గా నేటికి 55 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా అఖండ విజయం సాధించింది. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ప్రాంతీయ చలనచిత్ర బహుమతి గెలుచుకోవడమే కాకుండా రాష్ట్రప్రభుత్వ నంది బహుమతి, ఫిలింఫేర్‌ బహుమతి కూడా తన ఖాతాలో జమచేసుకుంది ‘అంతస్తులు’ చిత్రం. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి నటనకు కూడా బహుమతి లభించడం ‘అంతస్తులు’ పాత్ర మహిమే.

జమీందారు జగన్నాథరావు (గుమ్మడి) తన వివాహానికి పూర్వం వేరొక వనితతో వున్న సంబంధానికి ఫలితంగా కలిగిన బిడ్డ రాణి (భానుమతి). దివాణానికి ఆమె కూడా వారసులే. కానీ, అతని అదృశ్య భార్యకు సంతానం కావడమే ఆమె చేసుకున్న పాపం. ఆ దివాణంలో స్థానం కోసం, తన వారి అభిమానం కోసం తాపత్రయపడే రాణి అనుభవించిన ఆవేదన అంతా ఇంతా కాదు. రాణి అనాధగా ఉంటూ ఆటగత్తెగా పెరుగుతుంది. ఆ జమీందారుకు రఘు (అక్కినేని) ఒక ఆదర్శ కొడుకు. జమీందారు రెండవ కొడుకు నాగరాజు. తండ్రి విధించే క్రమ శిక్షణకు తట్టుకోలేక నాగరాజు గుండె ఆగి చనిపోతాడు. ఆ సంఘటనతో జమీందారు చలించిపోతాడు. పరాయి వూరిలో వున్న రఘును పిలిపించి అతనికో సోదరి వుందనే సంగతి చెప్పి, ఆ రహస్యం ఎవరికీ తెలియనీయద్దని మాట తీసుకొని మరణిస్తాడు. రఘు రాణిని కలుసుకొని ఆమెను దివాణానికి తీసుకొస్తాడు. కానీ రాణి జన్మ వృత్తాంతం తెలియని రఘు తల్లి రూపాదేవి (జి.వరలక్ష్మి) అందుకు ఒప్పుకోదు. మనసిచ్చిన ప్రేయసి (కృష్ణకుమారి) కూడా రఘు మీద సానుభూతి చూపదు. రహస్యం బయట పెట్టనని తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిన రఘుకు అవమానమే మిగుల్తుంది. ఆ ఇంటి ఆడపడుచుగా గుర్తింపు పొందాలని, చివరికి అక్కున చేర్చుకోవడమే అంతస్థులు కథాంశం. కె.వి.మహాదేవన్ సంగీత సారధ్యంలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ‘నినువీడని నీడను నేనే’ పాట హారర్ మోడ్ లో సాగుతూ.. అప్పటి జనాన్ని ఎంతగానో భయపెట్టింది. ఇంకా తెల్లచీర కట్టుకున్నదెవరికోసమూ, నువ్వంటే నాకెందుకో అదే ఇదీ., దులపరబుల్లోడోయ్ %

error: Content is protected !!