ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను ఒకొక్కరూ ఒకో రకంగా విని యోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా యువ దర్శకులు, రచయితలు స్టార్ హీరోల కోసం వైవిధ్యమైన కథల్ని వండుతున్నారు. వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం వెంకీ, వరుణ్ తేజలతో ఎఫ్ 3 చిత్రానికి రెడీ అవుతోన్న అనిల్ .. నందమూరి బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేస్తున్నాడట. బాలయ్య 100వ చిత్రానికి డైరెక్ట్ చేయాలని .. రామారావు అనే స్టోరీ రాసుకున్న అనిల్ .. క్రిష్ కారణంగా అప్పుడు మిస్ అయ్యాడు.
ఇప్పుడు మరోసారి బాలయ్య తో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నాడట. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణకు సరిపడే పక్కా స్టోరీని సిద్ధం చేసుకుంటున్నాడట. లాక్డౌన్ పూర్తయిన వెంటనే బాలకృష్ణకు కథ వినిపించేందుకు సిద్ధమౌతున్నారట అనిల్. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘ఎఫ్ 3’ తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లే చిత్రం బాలయ్యదే అవ్వాలని పట్టుదలతో ఉన్నాడట. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.