బాలీవుడ్‌లో స్టార్‌ కపుల్స్‌గా అందరి మన్నలను పొందుతున్న జంట దీపికా పదుకొణె – రన్వీర్‌సింగ్‌. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూనే ఉంటారు. తాజాగా దీపిక పదుకునే షేర్ చేసిన వీడియో నెటిజన్స్ ను అమితంగా ఆకర్షిస్తూ వస్తోంది. భర్త రణ్వీర్ సింగ్ కు ముద్దు పెడుతూ దీపిక పదుకునే షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.తాజాగా ఈ జంట ముద్దుముచ్చట్లలో మునిగిపోయారు. దీపికా పదుకొణె ఓ కొంటె వీడియోని షేర్‌ చేసింది. అందులో రన్వీర్‌ సింగ్‌ బుగ్గపై ముద్దులతో మురిపిస్తుంది. అంతేకాదు ఆ వీడియోకు ..‘‘ఈ ప్రపంచంలోనే అత్యుత్తమైన ఫేస్‌..క్యూట్‌ రన్వీర్‌సింగ్‌..’’ అంటూ తనదైన రీతిలో వ్యాఖ్యానించింది.
ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ఈ అందాల జంట ఇలా లాక్‌డౌన్‌ సమయంలో ఏకాంతంగా ముద్దు ముచ్చట్లలో మునిపోయారు. ప్రస్తుతం ఈ ముద్దుల వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. కొంతమంది అభిమానులైతే మీ జంట చాలా బాగుందనీ, మీ అందమైన జంట నిత్యం ఇలాగే ఉండాలని కామెంట్స్‌ పెడుతున్నారు. దీపిక పోస్ట్ చేసిన ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మీరు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు అన్నట్లుగా చాలా అందంగా ఉన్నారు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మీ జంట చాలా అద్బుతంగా ఉంది అంటూ నెటిజన్స్ ఈ వీడియోకు కామెంట్ చేస్తున్నారు. మీ జంట క్యూట్.. మీరు ఎంతో మందికి ఆదర్శం అంటూ నెటిజన్స్ ఈ జంటకు కితాబిస్తున్నారు.

View this post on Instagram

World’s Most Squishable Face!!!🌈 #cutie @ranveersingh

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

Leave a comment

error: Content is protected !!