‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దీని తర్వాత ప్రభాస్ మరో భారీ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దాదాపు రూ. 400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నఈ సోషియో ఫాంటసీ మూవీ ప్రభాస్ కు 21వ చిత్రం.
నవంబర్ లో కానీ, డిసెంబర్ లో కానీ .. సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాలో ముందుగా కథానాయికగా దీపికా పదుకొణేను అనుకున్నారు. అందుకోసం అమ్మాయి గారు రూ.15 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. అందుకే ఆమె స్థానంలో అలియాభట్ని ఫైనల్ చేయా లనుకుంటున్నారట. ఇందు కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా అశ్వనీదత్ వెనుకాడటం లేదని తెలుస్తోంది. అలియాభట్ ప్రస్తుతం రామ్చరణ్కు జోడీగా `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. సాహో చిత్రం కోసం ప్రభాస్ సరసన నటించడానికి బాలీవుడ్ నుంచి శ్రద్ధాకపూర్ కదలి వస్తే.. ఇప్పుడు ఈ భారీ చిత్రం కోసం ఆలియా భట్ రెడీ అవుతూండడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది.