వరుసగా సినిమాలు చేయడంలో నానీ తర్వాతనే ఎవరైనా. సంవత్సరానికి ఎంత లేదన్నా ఓ మూడు సినిమాల్ని పట్టాలెక్కించందే నిద్రపోడు నానీ. ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇంద్ర గంటి మోహన్ కృష్ణ దర్వకత్వంలో తెరకెక్కిన ‘వి’ చిత్రాన్ని కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేశాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత నానీ .. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్’ అనే యూత్ ఫుల్ మూవీని లైన్ లో పెట్టుకున్నాడు . ఈ సినిమా లాక్ డౌన్ కు ముందు ప్రారంభోత్సవం జరుపుకుంది.
దీని తర్వాత నానీ .. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే వెరైటీ మూవీని కూడా ప్రయార్టీలో పెట్టుకున్నాడు. అలాగే.. ‘మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ ధర్శకత్వంలో ఒక సినిమాకి కూడా కమిట్ మెంట్ ఇచ్చాడు. ఇక ఇవి కాకుండా..నేచురల్ స్టార్ శ్రీకాంత్ అనే కొత్త కుర్రోడు చెప్పిన ఒక వెరైటీ కథకు పడిపోయాడట. సకుమార్ శిష్యుడైన అతడు.. ఇన్నోవేటివ్ స్ర్కీన్ ప్లేతో ఈ సినిమా చేయబోతున్నాడట. కొన్ని రోజుల్లో ఈ సినిమాపై స్పష్టత రావొచ్చు. మరి ఈ కొత్త దర్శకుడు నానిని ఎలా చూపిస్తాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.