నిన్నయంగ్ టైగర్ యన్టీఆర్ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీస్ మొదలుకొని అభిమానుల వరకూ ట్వీట్ల ద్వారా అతడికి శుభాకాంక్షల వర్షం కురిసింది. అభిమానులు అయితే ట్విట్టర్ వేదికగా ఏకంగా  పెద్ద పండుగ వాతావరణం క్రియేట్ చేశారు. ఇంతవరకు ఇండియాలో ఏ హీరో ఫ్యాన్స్ చేయని విధంగా రికార్డు  ట్వీట్ల తో దుమ్మురేపేశారు. ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ తనకంటే సీనియర్ హీరోలు సాధించలేని రికార్డులను బద్దలు కొడుతున్నాడు ఎన్టీఆర్.

ఇంతవరకు హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్  హాష్ ట్యాగ్ మాత్రమే టాప్ స్థానంలో నిలిచింది. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ దేశంలో ఏ హీరోకు దక్కని విధంగా బర్త్ డే హ్యాష్ ట్యాగ్ రికార్డు ట్వీట్లు సాధించింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున 10.51 మిలియన్ల ట్వీట్ సాధించి దేశంలోనే టాప్ హీరోగా పవన్ కళ్యాణ్ నిలిచింది. ఈ రికార్డును నిన్న  జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెరిపేసారు. తాజాగా హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ ఇతర హీరోల బర్త్ డే హ్యాష్ ట్యాగ్ రికార్డులను మే 20వ తేదీ ఉదయం వరకు 13.5 మిలియన్ల ట్వీట్లకు పైగా సాధించి బ్రేక్ చేసింది. ఆ తర్వాత అది .. 20.8 మిలియన్స్ కు చేరింది. ప్రస్తుతం  ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ మాత్రమే టాప్ స్థానంలోకి చేరిందని.. ఇదే ఇప్పటివరకు బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ లో నంబర్ వన్ అని ప్రూవ్ చేశారు. మరి ఈ రికార్డ్ ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!