వివిధ ప్రాంతాల్నీ, ఆ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే యాసల్ని .. ఇప్పుడు సినిమాల్లో చూపించడం ట్రెండ్ గా మారింది. రంగస్థలం, అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి సినిమాలే దీనికి ఉదాహరణ. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో సినిమా కూడా చేరబోతోంది. బన్నీ, సుక్కు కాంబినేషన్ లో ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ సినిమా కథ. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగనుంది. అంటే దాదాపు చిత్తూరు యాసలోనే ఈ సినిమాలో సంభాషణలు ఉండబోతున్నాయని టాక్.

చిత్తూరు ప్రాంతానికి సంబంధించి అధికంగా అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాలో..  మాటలతో పాటు ..  పాటలు కూడా చిత్తూరు యాసలోనే  ఉండబోతున్నాయని సమాచారం. అంటే..  దాదాపు గా చిత్తూరు ప్రాంతవాసులు పాడుకొనే జానపద గీతాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయట. కథలో భాగంగా గిరిజనుల జానపదల గీతాన్ని తెరపై చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి. మరి ఫోక్‌ సాంగ్స్ తో ఎలా అలరిస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Leave a comment

error: Content is protected !!