ఇప్పుడు కేవలం ఈ సాంగ్స్ వల్ల మ్యూజిక్ కంపెనీలు ఫుల్ గా ఇన్ కమ్ రాబట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కి చెందిన కొంత మంది స్టార్ హీరోలు ఆ ఇన్ కమ్ కూడా ఎందుకు వదులుకోవాలి.. ఆ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుదాం అని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే మధుర శ్రీధర్ పూరీ జగన్నాథ్ లాంటి వారు ‘మధుర ఆడియో’ ‘లహరి మ్యూజిక్’ అంటూ సొంతంగా మ్యూజిక్ కంపెనీలను స్టార్ట్ చేసారు. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ వారు తన హవా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు ఇప్పటికే ఆ ప్రకారం అడుగులు వేస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
నటుడిగా బిజీగా ఉన్నప్పుడే వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన నాగార్జున సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది నాగార్జున బాటలోనే నడుస్తూ వ్యాపార రంగంలోకి దిగారు. అయితే వాళ్లలో కొందరు సక్సెస్ అవ్వగా మరికొందరు చేతులు కాల్చుకున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు – రామ్ చరణ్ లాంటి వారు సొంతంగా ప్రొడక్షన్ హౌసెస్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేసారు. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసి సొంతంగా మ్యూజిక్ కంపెనీలు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే మహేష్ బాబు – జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ మొదలైన స్టార్ హీరోలు ఆ వైపుగా అడుగులు వేయాలని చూస్తున్నారట. పాటల మీద వస్తున్న ఇన్ కమ్.. అలానే తరతరాలకి వచ్చే రాయల్టీ.. అన్ని లెక్కలు వేసుకొని హీరోలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఆ రంగంలో కూడా మన హీరోలు ఎలా వెలుగుతారో చూడాలి.