పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. చాలా ఈజ్ తో నటిస్తాడు… సహజ శైలిలో పలికే డైలాగ్స్ , మిడిల్ క్లాస్ అబ్బాయిల బాడీ లాంగ్వేజ్ .. అతడి ఐడెంటిఫికేషన్స్. పేరు రాజ్ తరుణ్ . అతడి తీరు కామెడీ పండించడం. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో స్ర్కిప్ట్ రైటర్ గా ఇండస్ట్రీకి వచ్చిన రాజ్ చరణ్… అనుకోకుండా ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరో అయిపోయాడు. మొదటి సినిమా అయినా యాక్టింగ్ లో ఎక్కడా తడబడకుండా సహజ శైలిలో నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఫష్ట్ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో .. రాజ్ తరుణ్ కు అవకాశాల వెల్లువ ప్రారంభమైంది.
రెండో సినిమా ‘సినిమా చూపిస్తమావ’ కూడా డీసెంట్ హిట్టవ్వడంతో .. వెంటనే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ లో ‘కుమారి 21 ఎఫ్’ లో హీరో అయిపోయాడు. ఈ సినిమా బంపర్ హిట్టవ్వడంతో హ్యాట్రిక్ హీరో అనే ట్యాగ్ అతడి మెళ్ళోపడింది. ఆపై .. రాజ్ తరుణ్ .. టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయాడు. వరుస అవకాశాలు అతడ్ని వరించాయి. కానీ .. కథల ఎంపిక విషయంలో కొన్ని పొరపాట్లు జరగడంతో .. ఈడో రకం ఆడోరకం తప్ప.. మిగతావేమీ అతడి కెరీర్ కు అండగా నిలబడలేకపోయాయి. ప్రస్తుతం మరో సూపర్ హిట్ తో ఎలాగైనా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు రాజ్ తరుణ్. అందుకే ఇప్పుడు కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘ఓరేయ్.. బుజ్జిగా’ అనే మూవీతో వస్తున్నాడు. నేడు రాజ్ తరుణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ యంగ్ టాలెంటెడ్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే రాజ్ తరుణ్ ..