నటవారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. అది పరిచయం వరకే పనికివస్తుంది. ఆ తర్వాత చావో రేవో తేల్చుకోవాల్సింది, హీరోగా నిరూపించుకోవాల్సింది ఎవరికి వారే. అలా ఎందరో వారసులు హీరోలుగా వచ్చి.. తమ టాలెంట్ తో రాణించ గలుగుతున్నారు. అలాంటి ఓ యువ తరంగం సుధీర్ బాబు.

‘ఏమాయ చేశావే’ చిత్రంలో హీరోయిన్ సమంతకు అన్నయ్యగా నటించిన సుధీర్ బాబు.. ఆ తర్వాత ‘యస్.యమ్.యస్, ప్రేమకథాచిత్రమ్, ఆడుమగాడ్రా బుజ్జీ, దొంగాట, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ , మోసగాళ్ళకు మోసగాడు, భలేమంచిరోజు, శమంతకమణి, సమ్మోహనం, వీరభోగ వసంతరాయలు, నన్నుదోచుకుందువటే’ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో తనదైన శైలిలో మంచి హీరోగా నటించి మెప్పించాడు. ఇక ‘బాఘీ’ చిత్రంతో బాలీవుడ్ లో విలన్ గానూ రాణించాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నానీ తో కలిసి ‘వీ’ అనే యాక్షన్ థ్రిల్లర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఇంకా మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు. నేడు సుధీర్ బాబు బర్త్ డే . ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు

Leave a comment

error: Content is protected !!