బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎర్లియర్ గా కొబ్బరిమట్టతో మంచి విజయం సాధించాడు. తదుపరిగా సరికొత్త కాన్సెప్ట్ తో .. న్యూ మేకోవర్ తో ఓ మెడికల్ హారర్ తో రాబోతున్నాడు. సినిమా పేరు ‘?’. కొచిన్ మార్క్ నే తన సినిమా టైటిల్ గా పెట్టుకొని ఈ సారి కామెడీగా భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు. నోలన్ మౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఉహాన్ గబ్బిళాల మార్కెట్ లో చిత్రీకరించిన చివరి సినిమా అనే క్యాప్షన్ తో రానుంది.

నేడు సంపూర్ణేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా యూనిట్ అతడి కొత్త సినిమాకు సంబంధించిన ఫష్ట్ లుక్ ను విడుదల చేసింది. సరికొత్త గెటప్ లో గబ్బిళాల సమక్షంలో .. ఒక చెయిర్ లో కూర్చొని సీరియస్ గా ఆలోచిస్తోన్న సంపూ లుక్ ఆసక్తి రేపుతోంది. సంపూర్ణేష్ బాబు అన్ని చిత్రాల మాదిరిగానే.. ఈ సినిమా కూడా ఒక వెటకారపు కామెడీ చిత్రంగా తెరకెక్కుతోందని అర్ధమవుతోంది. ఈ ఏడాది జూలై 30న విడుదల కానున్న ‘?’  సినిమా  సంపూకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!