మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో క్లాసిక్  చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. చిరు మాసీ యాక్టింగ్.. అందాల శ్రీదేవి అభినయ విన్యాసం.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, యండమూరి, జంధ్యాల, సత్యమూర్తి సృజనాత్మకత.. ఇళయరాజా మ్యూజికల్ మ్యాజిక్, అశ్వనీదత్ నిర్మాణ దక్షత కలగలిసి ఈ సినిమాని టాలీవుడ్ లోనే గొప్పచిత్రంగా నిలబెట్టాయి. 1990, మే  9న విడుదలైన ఈ సినిమా మరో రెండు రోజుల్లో 30 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా .. ఈ సినిమాపై నిన్న నానీ ఒక వీడియో తో హల్ చల్ చేసి అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్ గా చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం 30 ఏళ్ళు పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకొని .. తన సంతోషాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం నిజంగానే తన కెరీర్ లో గొప్పచిత్రమని, దీని వెనకాల ఎంతో మంది టెక్నీషియన్స్ ప్రతిభ దాగి ఉందని, ఆ సినిమాతో సంబంధం , అనుబంధమున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాభినందనలని , తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ 25 మూవీస్ లో జగదేవక వీరుడు అతిలోక సుందరి చిత్రం చోటు దక్కించుకుందని .. ఇది టైమ్ లెస్ అని.. ఈ సినిమాకి పాత , కొత్త తారతమ్యం లేదని అభిప్రాయపడ్డారు.

 

 

 

 

Leave a comment

error: Content is protected !!