‘నకిలీ, డాక్టర్ సలీమ్’ చిత్రాలతో తెలుగునాట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత ‘బిచ్చగాడు’ మూవీ  ఘన విజయంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే బేతాళుడు, యమన్, ఇంద్రసేన, రోషగాడు చిత్రాలతో పరాజయాలెదుర్కొన్న ఈ హీరో ..  ప్రస్తుతం తమిళంలో తమిళరసన్, అగ్ని సిరగుగళ్, ఖాకీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా స్లంప్ లో పడిపోయింది దక్షిణాది  సినీ పరిశ్రమ.

మునుపటి రోజులు మళ్లీ వస్తాయనే ఆశ ఇప్పట్లో కనిపించడం లేదు. అందుకే కొందరు సినీ పెద్దలు నటీనటులు తమ పారితోషికాన్ని కొంతమేర తగ్గించుకుంటే మంచిదనే అభిప్రాయాలు వెలిబుచ్చారు. తాజాగా ఈ నిర్ణయంపై హీరో విజయ్‌ ఆంటోని తన పారితోషికాన్ని ఇరవైఆయిదు శాతం తగ్గించుకోవడానికి అంగీకరించారు. తన కొత్త చిత్రాల నుంచే ఆ పనిమొదలుపెడతానిని చెప్పాడు. మ్తొతం మీద ఈ ‘బిచ్చగాడు’ మంచి నిర్ణయమే తీసుకున్నాడని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాదు మిగతా నటీనటులతో పాటు సాంకేతికబృందం కూడా చిత్రసీమకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకొంటే మునుపటి మళ్లీ రావొచ్చుని కూడా అనుకుంటున్నారు. మరి మిగతా హీరోలు కూడా అతడ్ని ఫాలో అవుతారేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!