అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ .. అల్లరి చేష్టలకు, చిలిపి వేషాలకు సోషల్ మీడియాలో చాలా మంది వీరాభిమానులున్నారు. చాలా క్యూట్ గా మాట్లాడ్డం., తండ్రి సినిమాల్లోని పాటలకు క్యూట్ గా స్టెప్స్ వేయడం.. సినిమాల్లోని పాటలు పాడడం చేస్తూ బన్నీ అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి అర్హ లేటెస్ట్ వీడియో అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ఇంతకీ ఏమిటా వేషం అంటే.. సంక్రాంతి బ్లాక్ బస్టర్ `అల వైకుంఠపురములో` చార్ట్ బస్టర్ సాంగ్ `బుట్ట బొమ్మ`కు అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ అల్లు అర్హ లిప్ సింకింగ్ చేసింది.

అయితే ఆ పాటను బ్యాక్ గ్రౌండ్ లో ఓ వెస్ట్రన్ బ్యూటీ పాడడం ఇంట్రెస్టింగ్. ఈ వేషాల్ని వీడియో షూట్ చేసి స్నేహారెడ్డి నేరుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్షణాల్లోనే  వైరల్ గా మారిపోయింది.  ఇక అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం సన్నాహకాల్లో ఉండగానే కరోనా లాక్ డౌన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ తీరిక సమయాన్ని అర్హ.. అయాన్ లతోనే టైమ్ పాస్ చేస్తున్నారు అల్లు అర్జున్. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంతకుముందు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Leave a comment

error: Content is protected !!