ఇండస్ట్రీలోని ఫేక్ న్యూస్ పై తొలిసారి యంగ్ హీరో విజయ్ దేవరకొండ నోరు విప్పాడు. తెలుగులో వెబ్సైట్లు కావాలనే విపరీతంగా తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. అందులో ముఖ్యంగా రెండు మూడు వెబ్సైట్స్ మాత్రం ఏ మాత్రం అర్హత లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కూడా కక్ష్య పెట్టుకుని రాస్తున్నారంటూ మండిపడ్డాడు ఈయన. కొందర్ని మనసులో పెట్టుకుని వాళ్లపై కావాలనే కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారంటూ ఆయన మండి పడ్డాడు.
వాళ్లు అడిగినట్లు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే లేదంటే సినిమా యాడ్స్ ఇవ్వకపోతే వాళ్ల విలువలు కూడా పక్కనబెట్టి చెత్త వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యాడు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ అంతా సపోర్టుగా నిలిచింది. విజయ్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. మహేష్ బాబు, రవితేజ, హరీష్ శంకర్, బివిఎస్ రవి, రానా దగ్గుబాటి ఇలా చాలా మంది విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచారు.
Thank you @urstrulyMahesh sir 🤗
We stand together 💪🏼🤘🏼
It's time. #KillFakeNews #KillGossipWebsites https://t.co/Ib3KK051Iz— Vijay Deverakonda (@TheDeverakonda) May 4, 2020