నట భూషణ శోభన్ బాబు కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం ‘బాబు’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డెబ్యూ మూవీగా ప్రత్యేకతను సంతరించుకున్న ఈ సినిమా  1975, మే 2న విడుదలై  నేటికి సరిగ్గా 45 ఏళ్ళు పూర్తి చేసుకుంది.  రాఘవేంద్రరావు తండ్రి కె.యస్ ప్రకాశరావు ఈ సినిమాకి కథ అందించగా.. ఆచార్య ఆత్రేయ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ రాశారు. మారుతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని ఏ.ఎల్ .కుమార్ నిర్మించారు. వాణీశ్రీ, లక్ష్మి కథానాయికలుగా నటించగా.. గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, జి.వరలక్ష్మి, కల్పనారాయ్, బేబీ వరలక్ష్మి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చక్రవర్తి సంగీత సారధ్యంలో ‘ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు.. ఒక జంట కలిసిన తరునాన .. అయ్య బాబోయ్.. ఈనాటి నుంచి జరగాలి మంచి.. నా స్నేహం పండి..’ లాంటి పాటలు  అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి.  శోభన్ బాబు కెరీర్ లో బాబు చిత్రం ప్లాప్ అయినా.. కె.రాఘవేంద్రరావు తొలి చిత్రంగా మాత్రం చరిత్రలో మిగిలిపోయింది.

Leave a comment

error: Content is protected !!