అతడి స్టైల్ కి మాస్ జనం వెర్రెక్కిపోతారు.  అతడి యాక్టింగ్ కు చిన్నపెద్దా ఊగిపోతారు. అతడి యాక్షన్ కు విజిల్స్ తో థియేటర్స్ మారుమోగిపోతాయి. నెరిసిన గెడ్డం.. తెల్లబడిన జుట్టు … సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో స్ర్కీన్ మీద విజృంభించే  అతడు ఎప్పుడూ యూత్ ఫుల్ హీరోనే. వైవిధ్యమైన కథలతో విలక్షణమైన పాత్రలతో .. తమిళనాట తల గా మారిన అతడి పేరు అజిత్ కుమార్ సుబ్రహ్యణ్యం.

అజిత్ పుట్టింది హైద్రాబాద్ లో . అమ్మ సింధి, నాన్న మలయాళీ. కానీ పెరిగింది మాత్రం తమిళనాడు లో. చిన్నప్పుడు  తల్లి దగ్గర సింధి నేర్చుకోవడంతో.. అజిత్ కు  హీరో అయిన తర్వాత తమిళం మాట్లాడడం పెద్ద ఇబ్బందిగా ఉండేది. అయినా సరే పట్టుబట్టి తమిళం నేర్చుకొని ఇప్పుడు అందులో మాస్టర్ అయ్యాడు. హీరో అవ్వకుముందు అజిత్ పెద్ద కార్ రేసర్ అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఫార్ములా 2 రేసర్ గా తిరుగులేని పేరు ప్రఖ్యాతులు గడించిన అజిత్ ..  1990 లో ఎన్ వీడు ఎన్ కణవర్ మూవీలోని ఒక పాటతో మొదటి సారిగా స్ర్కీన్ మీద కనిపించాడు. ఆ తర్వాత తెలుగులో ‘ప్రేమ పుస్తకం’ మూవీతో శ్రీకర్ పేరుతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ పై ‘అమరావతి, కాదల్ కోట్టై, ఆశై, అవళ్ వరువల, కాదల్ మణ్ణన్’ లాంటి ప్రేమకథాచిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ‘వాలి ,ముఖవరి, కండుకొండేణ్ కండు కొండేణ్ , సిటిజన్, అమర్కాలం’ లాంటి సినిమాలతో యాక్షన్ హీరోగానూ మారాడు. తమిళ నాట రజనీకాంత్ తర్వాత అంతటి స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న అజిత్ కుమార్ ..  ఇప్పటివరకూ దాదాపు 59 చిత్రాల్లో నటించాడు. తెలుగులో కూడా అతడికి ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.   ప్రస్తుతం అజిత్ కుమార్  60వ చిత్రం ‘వలిమై’ లో నటిస్తున్నాడు. నేడు అజిత్ పుట్టినరోజు . ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే అజిత్

Leave a comment

error: Content is protected !!