కరోనా మహమ్మారి దెబ్బ అన్నిరంగాలకు చాలా ఎక్కువగా తగిలింది . లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం స్తంభించిపోయింది. సినీ పరిశ్రమ సైతం షూటింగ్స్‌ను వాయిదా వేయడంతో సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రోజువారీ సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏరోజుకారోజు కూలీ చేసుకునే వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దీంతో వారికి కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో వీరికి అండగా ఉండేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సిసిసి పేరుతో చిరంజీవి నాయకత్వంలో సహాయం అందిస్తున్నారు. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తీరే వేరని నిరూపిస్తున్నాడు.

కరోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌న వంతు బాధ్య‌త‌గా ఆప‌ద‌లో వున్న‌వారిని ఆదుకోవ‌డానికి, లాక్‌డౌన్ త‌రువాత ఏర్ప‌డ‌బోయే నిరుద్యోగాన్ని అధిగ‌మించ‌డం కోసం `ది దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్‌`ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య త‌ర‌గ‌తివారిని ఆదుకోవ‌డం కోసం 25 ల‌క్ష‌ల‌తో ఫండ్‌ని ఏర్పాటు చేశారు. ఎవ‌రైతే నిజంగా ఇబ్బందులు ప‌డుతున్నారో వారు త‌మ వెబ్ సైట్లో న‌మోదు చేసుకోవాల‌ని, అలాంటి వారికి త‌మ టీమ్ నిత్యావ‌స‌రాల‌ని కొనిస్తుంద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ వెల్ల‌డించారు. అయితే విజ‌య్ దేర‌వ‌కొండ ఫౌండేష‌న్‌కు 1800 వంద‌ల మంది స్పందించి 18,74, 805 ల‌క్ష‌ల విరాళం అందించిన‌ట్టు విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ప్ర‌తి రోజు రాత్రి 9 గంట‌ల‌కు మిడిల్ క్లాస్ ఫండ్‌కు సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. `ఇవ్వాళ నేను మ్యాజిక్ చూశాను. మిడిల్ క్లాస్ ఫండ్ విజ‌యం మీకే ద‌క్కుతుంది. మీరు కేవ‌లం ఒక్క రోజులో 25 ల‌క్ష‌లు 43 ల‌క్ష‌లు దాటేలా చేశారని వెల్ల‌డించారు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. దీంతో రౌడీ హీరో చేసై్తున్న ప‌నికి సినీ వ‌ర్గాలే కాదు అన్ని వ‌ర్గాల వారు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

 

Leave a comment

error: Content is protected !!