లాక్ డౌన్ తో  షూటింగ్స్ లేక స్టార్ హీరోలు సైతం ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే.. ఇంట్లో ఉన్నా కూడా హీరోలు ఏవేవో ఛాలెంజెస్ పేరుతో అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు. బి ద రియల్ మేన్ ఛాలెంజ్ లు , బుక్ రీడింగ్ ఛాలెంజ్ లు చేస్తోన్న స్టార్ హీరోలు ..  మనవరాళ్ళతో కూడా ఆడుకొనే పని పెట్టుకుంటున్నారు.  మొన్నటికి మొన్న రాజేంద్ర్రప్రసాద్ తన మనవరాలికి జీవిత పాఠాలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవికూడా చేరారు.

చిరు ఏడాది వయసున్న మనవరాలు (శ్రీజ కుమార్తె ) నవిష్కతో తన పాటను ఎంజాయ్ చేయడం ఆకట్టుకుంటోంది. ఖైదీ నెం. 150లోని మిమ్మి మిమ్మిమీ పాటకు నవిష్క చాలా హుషారుగా తాతయ్య తో కలిసి పాట చూస్తూ చిందులేస్తోంది.  పాట ఆపేస్తే మాత్రం ఏడుపు మొదలుపెడుతోంది. చిరంజీవి సైతం ఆ మూమెంట్ ను ఎంతో ఎంజాయ్ చేస్తూ .. తన లాక్ డౌన్ టైమ్ ను గడుపుతున్నారు.  మెగాస్టార్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

Leave a comment

error: Content is protected !!