Shopping Cart 0 items - $0.00 0

పెదరాయుడు

   

విలక్షణ నటుడు మోహన్ బాబు నటజీవితంలో  ఓ  ప్రత్యేకమైన చిత్రం ‘పెదరాయుడు’. లక్ష్మీ ప్రసన్నాపిక్చర్స్  బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1995, జూన్ 15న విడుదలై అప్పట్లో రికార్డ్ కలెక్షన్స్ కురిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కేమియో అపీరెన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. పెదరాయుడు గా మోహన్ బాబు అద్వితీయ నటన మిరిచిపోలేనిది. అన్నదమ్ములుగా మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన తండ్రి పాపారాయుడు గా రజనీకాంత్ నభూతో నభవిష్యత్ అనే రీతిలో నటించి.. సినిమా ఘనవిజయానికి ప్రధాన కారకుడయ్యాడు. సౌందర్య , భానుప్రియ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో రాజా రవీంద్ర, ఆనందరాజ్, జయంతి, చలపతిరావు, కైకాల సత్యనారాయణ, శుభశ్రీ, బ్రహ్మానందం, బాబూ మోహన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. రాజ్ కోటి సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు అప్పట్లో అత్యధిక ప్రజాదరణ పొందాయి. నిజానికి ఈ సినిమా 1994 లో తమిళంలో విడుదలైన ‘నాట్టామై’ చిత్రానికి రీమేక్ వెర్షన్. శరత్ కుమార్, విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇదే సినిమా ఆ తర్వాత కాలంలో హిందీలో అనిల్ కపూర్ హీరోగా బులంది గానూ, కన్నడలో విష్ణు వర్ధన్ హీరోగా సింహాద్రియ సింహా గానూ రీమేక్ .. అక్కడ కూడా ఘనవిజయం సాధించాయి.

Leave a comment

error: Content is protected !!