విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో ‘ఆటగాడు’ ఒకటి. శ్రీవెంకటేశ్వరా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై జి.రాజేంద్రప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు తాతినేని రామారావు. అందాల శ్రీదేవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో రావుగోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, జగ్గయ్య, పద్మనాభం, ప్రభాకర రెడ్డి, నూతన ప్రసాద్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 1980, ఏప్రిల్ 24న విడుదలైన ఈ సినిమా నేటికి 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఒక జమీందార్ ను హత్యచేసి .. కథానాయిక తండ్రిపై హత్యనేరం మోపి.. జైలుకు పంపుతారు ఓ ముగ్గురు దుష్టులు. హీరోయిన్ వారిపై పగ తీర్చుకోడానికి హీరో సహాయం కోరుతుంది. చివరికి వారిని చట్టానికి పట్టించడమే మిగతా కథ. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో యన్టీఆర్ సింగర్ గా నటించారు. చక్రవర్తి సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ మారుమోగుతునే ఉన్నాయి. జిమ్ జిమ్ జిలాబీ, చీమ కుట్టిందా, ఏకో నారాయణ, గుద్దుతా నీయబ్బా గుద్దుతా లాంటి మాస్ సాంగ్స్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి

Leave a comment

error: Content is protected !!