Shopping Cart 0 items - $0.00 0

మగాడు

రాజశేఖర్ కు యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘మగాడు’ ఒకటి. బాబూ గణేశ్ నిర్మాణ సారధ్యంలో ప్రముఖ మలయాళ దర్శకుడు కె.మధు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1990, ఆగస్ట్ 9న విడుదలైంది. లిజి, మురళీ మోహన్, శరత్ కుమార్, దేవదాస్ కనకాల, ప్రతాప్ చంద్రన్  తదితరులు నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.  రాష్ట్ర హోమ్ మినిస్టర్ తో విహార యాత్రకు బైలు దేరిన కొందరు స్కూల్ విద్యార్ధుల్ని.. ఆయనతో సహా  టెర్రరిస్ట్ లు కిడ్నాప్ చేయడంతో  ఓ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. చివరికి ఆ ఆఫీసర్ టెర్రరిస్ట్ ఆటలు ఎలా కట్టించాడు.. హోమ్ మినిస్టర్ ను , పిల్లల్ని సురక్షితంగా ఎలా బైటికి తీసుకురాగలిగాడు అన్నదే మిగతా కథ. ఇందులో కొన్ని ఫైట్  సన్నివేశాల్లో రాజశేఖర్ డూప్ లేకుండా పాల్గొనడంతో .. ఒక ప్రమాదంలో  ఆయన కాలు ఫ్రాక్చర్ అయి… బెడ్ కు పరిమితమవ్వాల్సి వచ్చింది. పెద్ద గండం నుంచి బైట పడిన రాజశేఖర్ కెరీర్ కు .. ఈ సినిమా ఘన విజయం మంచి హెల్ప్ అయింది. హాలీవుడ్ మూవీ డై హార్డ్ ఛాయలున్న ఈ సినిమా నిజానికి మలయాళ సినిమా ‘మూన్నామ్ ముర’ కు రీమేక్ వెర్షన్ . మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాకు కూడా కె.మధునే దర్శకుడు.  ఒక విధంగా మోహన్ లాల్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. మలయాళ చిత్రాన్ని ఎలాంటి మార్పులు లేకుండా యాజిటీజ్ గా తెరకెక్కించాడు దర్శకుడు మధు.  ఈ సినిమా రాజశేఖర్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించుకుంది.

Leave a comment

error: Content is protected !!