కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు ఇంట్లో తమ భార్యలకు పనుల్లో సహాయపడుతున్నారు. అందులో భాగంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు రాజమౌళికి ఓ ఛాలెంజ్ విసిరారు. వంట సామానులు కడుగుతూ – ఇంటిని శుభ్రం చేస్తూ వీడియోను రికార్డు చేసి నిన్న ట్విట్టర్ లో షేర్ చేసి ‘బీ ద రియల్ మెన్’ అని రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు. . అంతేకాదు ఆయన ఎన్టీఆర్ – చరణ్ లకు ఛాలెంజ్ విసిరాడు.
దీంతో రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన తారక్.. టాలీవుడ్ సూపర్ సీనియర్లైన చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – బాలయ్యల తో పాటు దర్శకుడు కొరటాల శివను ఛాలెంజ్ చేశాడు.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా జూనియర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. మరో పక్క రాజమౌళి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన రామ్ చరణ్ .. ఇంటిపనులు చకచకా చేస్తూ.. తన భార్య ఉపాసనకు కాఫీ ఇచ్చి రిలాక్స్ అయ్యాడు. అంతేకాదు .. దర్శకుడు త్రివిక్రమ్ కు, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కు, దగ్గుబాటి రానాకు, శర్వానంద్ కు ఛాలెంజ్ విసిరాడు. ఆ మేరకు వాళ్ల పేర్లు మెన్షన్ చేస్తూ ట్వీట్ చేశాడు రామ్ చరణ్ .
Done @ssrajamouli garu !!
Let's take pride in doing chores at home! Let's be real men and help the women by sharing the work load.#BetheREALMAN
I further nominate Trivikram garu, @RanveerOfficial, @RanaDaggubati and @ImSharwanand to take up the challenge. pic.twitter.com/ItQ0zNQOR8
— Ram Charan (@AlwaysRamCharan) April 21, 2020