కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది.  పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి.

దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు బొమ్మలు గీసుకుంటున్నారు. కొందరు ఇష్టమైన సినిమాలు చేస్తూ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే అందాల శ్రుతి హాసన్ మాత్రం బెండకాయ పచ్చడి చేసి.. తన పాక శాస్త్ర ప్రావిణ్యాన్ని ప్రదర్శించింది.   తెలుగు ప్రజలు ఎంతగానో ఇష్టపడే దోశ, బెండకాయ పచ్చడిని స్వయంగా చేసి చూపించింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన పచ్చడి గురించి తెలియజేస్తూ.. ‘‘బెండకాయ పచ్చడిని నేనెంతో ఇష్టపడతా. నాకు కారంగా ఉంటే చాలా నచ్చుతుంది. అందుకే ఎప్పుడీ పచ్చడి చేసినా మిర్చి ఎక్కువగా వేస్తుంటా’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది శ్రుతి.

Leave a comment

error: Content is protected !!