కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్ తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. అయితే కరోనా వైరస్‌ను జయించేందుకు పాటల ద్వారా చైతన్య పరుస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇప్పటికే ప్రజల్ని మేలుకొలుపుతూ ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ అనే పాటను రీమేక్ చేసి వదలగా.. నేడు ‘నీ ప్రాణాలు ఫణమొడ్డి ప్రాణాలు నిలబెట్టి ప్రజా వైద్యులారా’’ అనే పాటను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్ చేతుల మీదుగా విడుదల చేశారు.
కోవిడ్ పై ఎం.ఎం. కీరవాణి స్వరపర్చిన పాటను విని ఆయన్ని అభినందించారు సీపీ సజ్జనార్. ఆలోచింపజేసే గీతాన్ని రచించిన పీఏ శ్రీధర్‌కు సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ టౌన్ ఉన్నప్పటి నుండి ప్రజలందరూ క్షేమం కోసం కష్టపడుతున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ కార్మికులు, మీడియా వాళ్ల మీద పాటను రచించి స్వరపరచిన ఎం ఎం కీరవాణి సీపీ సజ్జనార్ అభినందించారు.
‘నీ ప్రాణాలు ఫణమొడ్డి ప్రాణాలు నిలబెట్టి ప్రజా వైద్యులారా ..
మేము వేసిన చెత్త మీ చేతులతో ఎత్తే సపాయి తల్లులారా..
సూర్యచంద్రుల సాడి పొద్దు తోటి పోటి రక్షకభటులారా..
వార్తలెన్నో మోసి ప్రజల ముందు ఉంచే మీడియా మిత్రులారా..
దేవుండ్లంతా కలిసి మీ రూపాలల్లో తిరుగుతున్నరమ్మా..
మీ సేవల పుణ్యాన జగమంత మరుజన్మ ఎత్తుతున్నదమ్మా..
ఎంత పొగిడిన ఏమి ఇచ్చిన మీ రుణం ఎట్ల తీర్చుకుందుము..
మరుజన్మ అనేది మళ్లొక్కటి మాకుంటే మీ కొలువు మేం జేతుము’ అంటూ శ్రీధర్ మేలుకొలిపే సాహిత్యం అందించగా… అంతే అద్భుతంగా స్వరపరిచి ఆలపించారు కీరవాణి.
Appreciations to Doctors, Police, Sanitation workers and Media who are front line fighters against Corona Virus. sung by @mmkeeravaani @kaalabhairava7 @simha2302 written by Sridhar Gavvala https://t.co/YQehuetn92@KTRTRS @TelanganaDGP @SCSC_Cyberabad @CYBTRAFFIC @TelanganaCMO pic.twitter.com/6EiYjxUZMs
— Cyberabad Police (@cyberabadpolice) April 18, 2020