Shopping Cart 0 items - $0.00 0

కొండపల్లి రాజా

 

 

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో సూపర్ హిట్ మాస్ యాక్షన్ మూవీ కొండపల్లి రాజా. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో సౌదామిని క్రియేషన్స్ బ్యానర్ పై కె.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా 1993, జూలై 9న విడుదలైంది. అందాల నగ్మా కథానాయికగా నటించిన ఈ సినిమాలో మరో హీరోగా సుమన్ నటించాడు. కోట శ్రీనివాసరావు, కెప్టెన్ రాజు,ఆలీ, సుజాత, కాస్ట్యూమ్స్ కృష్ణ,సుధాకర్, యువరాణి, రేఖ, అర్చనా పూరణ్ సింగ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీత సారధ్యంలోని పాటలన్నీ అప్పట్లో సూపర్ హిట్టుగా నిలిచాయి. నిజానికి ఈ సినిమా 1987లో విడుడలైన హిందీ సినిమా ‘ఖుద్ గర్జ్’ (జితేంద్ర, శత్రుఘ్నుసిన్హా హీరోలు) కు రీమేక్ వెర్షన్ . అప్పట్లో ఇదే సినిమా తెలుగులో కృష్ణం రాజు, శరత్ బాబు హీరోలుగా ప్రాణస్నేహితులుగా విడుదలైంది. అయితే ఆ తర్వాత అదే సినిమా తమిళంలో రజనీకాంత్ హీరోగా ‘అన్నామలై’ గా విడుదలై సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ వెర్షన్ నే రవిరాజా పినిశెట్టి తెలుగులో ‘కొండపల్లి రాజా’గా తెరకెక్కించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఒక స్థలం విషయంలో  కలిగిన అపార్ధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వెంకీ కెరీర్  కు మంచి బూస్టప్ నిచ్చింది.

Leave a comment

error: Content is protected !!