కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి.
దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు బొమ్మలు గీసుకుంటున్నారు. కొందరు ఇష్టమైన సినిమాలు చేస్తూ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే .. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మాత్రం.. తన కెరీర్ కు బాగా పనికొచ్చే పని చేస్తోందట.అంటే అమ్మడు.. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించిన కోర్సును నేర్చుకుంటూ ఉందట. ప్రతి రోజు ఆన్ లైన్ లో క్లాస్ లు వింటున్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం కోర్సులో మూడవ సెషన్ కొనసాగుతుందని చెప్పింది. స్క్రిప్ట్ రైటింగ్ ఇంకా దర్శకత్వంకు సంబంధించిన క్లాస్ లను వింటున్నట్లుగా చెప్పుకొచ్చింది. టైం వేస్ట్ చేయకుండా ఇలా సద్వినియోగం చేసుకుంటూ ఫిల్మ్ మేకింగ్ పై అవగాహణ పెంచుకోవడం అనేది నిజంగా అధినందనీయం.