కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల పై పంజా విసిరింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మన దేశ ప్రజలు లాక్ డౌన్ అమలకు సహకరిస్తూ.. ఎవరింట్లో వారు ఉంటున్నారు. అయితే ఈ పోరులో త్రివిధ దళాల తరహాలో పోలీసులు, డాక్టర్లు , పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మన దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు రోడ్లను క్లీన్ గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  అందుకే  వీరి త్యాగాలను ట్విటర్‌ వేదికగా కొనియాడారు అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు. 

విధుల్లో అంకిత భావంతో పనిచేస్తున్న కొందరు పారిశుద్ధ్య కార్మికుల ఫొటోలను తన ట్విటర్‌ ద్వారా షేర్‌ చేస్తూ.. ఇది వారి కోసమే చేస్తున్న ప్రత్యేక ట్వీట్‌ అన్నారు. ‘‘మనమంతా మన ఇళ్లలో సురక్షితంగా ఉంటున్నాం. కానీ, వాళ్లు మాత్రం మనం ఆ మహమ్మారి బారిన పడకుండా చూసేందుకు వాళ్ల సొంత కుటుంబాలను వదిలి నిత్యం ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. ప్రస్తుతం మనమంతా కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లూ మన కోసం ఎంతో శ్రమించి పని చేస్తున్నారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా గౌరవంతో కూడిన ప్రేమాభిమానాలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు మహేష్‌.

Leave a comment

error: Content is protected !!