కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి.
దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం విభిన్నంగా లాక్ డౌన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. చిరు ప్రస్తుతం తన ఇంటి పరిసరాల్ని వాటరింగ్ చేస్తూ శుభ్రపరుచుకుంటున్నారు. పరిశుభ్రతకు ఎప్పుడూ విలువనిచ్చే చిరంజీవి తన పనిని పనివాళ్ల మీద ఒదిలివేయకుండా.. స్వయంగా చేసుకోవడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఇతర హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన వాటరింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ది పాత్ వి టేక్ షుడ్ ఆల్వేస్ బీ క్లీన్ అనే కేప్షన్ తో చిరు పోస్ట్ చేసిన ట్వీట్ మీరే చూడండి.
The paths we take should always be clean #LockdownActivities #StayHomeStaySafe pic.twitter.com/7Ie4frsTut
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 16, 2020