కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది.  పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు.

ఇటీవల లాక్ డౌన్ కాలాన్ని మే 3వరకు పొడిగించుతూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను అభినందించారు. కారోనా వైరస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ యుద్ధంలో అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీస్, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. క‌రోనా వైర‌స్ ఎంత భ‌యాన‌క‌మైన‌దైనా, దాని వ‌ల్ల దేశ‌మంతా ఒక్క‌టేన‌నే భావ‌న ఏర్ప‌డ‌టం, కుల మ‌త భేదం లేకుండా, పేద ధ‌నిక తార‌త‌మ్యం లేకుండా అంద‌రం ఐక‌మ‌త్యం ప్ర‌ద‌ర్శించ‌డం గొప్ప విష‌యం అని అన్నారు . ఇదే స్ఫూర్తితో మే 3 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతం చేద్దాం. అంద‌రం ఇళ్ల‌ల్లో ఉండి ప్ర‌భుత్వాల‌కు, పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రిద్దాం అని బోయపాటి ఓ సుదీర్ఘ సందేశం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Leave a comment

error: Content is protected !!