Shopping Cart 0 items - $0.00 0

ఫ్యామిలీ తో ఆనందంగా గడుపుతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు

ఎంత సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ  టైమ్ వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులతో గడపడం.. ఫ్యామిలీతో తరచుగా టూర్స్ కు వెళ్లడం సూపర్ స్టార్ మహేశ్ బాబుకు అలవాటు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలు అవడంతో .. తన కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తూ .. వారిని సంతోష పరచడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.

 కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితార లతో కలిసి .. ప్రస్తుతం తన నివాసంలో కాలక్షేపం చేస్తున్నాడు. స్టే హోం.. మాస్క్ ఫర్ ఆల్ అంటూ.. హ్యాష్ ట్యాగ్స్ తో తన ట్విట్టర్ హ్యాండిల్ లో హడావిడి చేస్తున్నాడు.  ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ వారిఫోటోస్ ను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు.

Leave a comment

error: Content is protected !!