సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో మరచిపోలేని రొమాంటిక్ మూవీ ‘యువరాజు’. వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు. 2000, ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా నేటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సాక్షిశివానంద్, సిమ్రాన్ కథానాయికలు గా నటించి ఈ సినిమాకి రమణ గోగుల సంగీతం అందించడం విశేషం. చింతపల్లి రమణ సంభాషణలు అందించిన ఈ సినిమా మంచి  విజయం సాధించింది. మహేశ్ బాబు హీరోగా నటించిన రెండో చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా కథ..  బాలీవుడ్ మూవీ కుఛ్ కుఛ్ హోతాహై సినిమా ఛాయలతో సాగుతుంది. వేటూరి, సిరివెన్నెల , చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఈ సినిమా నుంచే మహేశ్ బాబు పేరు ముందు ప్రిన్స్ అనే బిరుదు వచ్చి స్థిరపడింది. మొత్తం మీద   యువరాజు .. హీరోగా మహేశ్ బాబు కెరీర్  కు గట్టి పునాదులు వేసిన చిత్రంగా నిలిచిపోయింది. 

 

 

Leave a comment

error: Content is protected !!