కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. ఇక  ప్ర‌తీరోజు ప్రెస్ మీట్స్‌లో బిజీగా ఉండే సినీ పాత్రికేయులు కూడా ఇంట్లోనే ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వారికి ఆస‌రాగా నిల‌వాల‌న్న‌ ఉద్దేశ్యంతో స‌భ్యులంద‌రికీ అసోసియేష‌న్ ద్వారా దాదాపు మెంబ‌ర్లు అంద‌రికీ పోన్లు చేసి ఎలాంటి తార‌త‌మ్యం లేకుండా, వ‌ద్దన్న వారిని వ‌దిలేసి 87 మందికి సోమ‌వారం నాడు ఒక్కొక్క మెంబ‌ర్‌కి ఐదువేల రూపాయ‌లు చొప్పున వారి అకౌంట్‌లో నెప్టీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. అలాగే గ‌త వారం కొంత మంది మెంబ‌ర్స్‌కి నిత్యావ‌స‌ర వ‌స్తువులను కూడా అందించారు.

ఈసంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ, ‘క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హాయ స‌హకారాల‌తో మ‌రియు హెల్త్ క‌మిటీ చైర్మెన్ రెడ్డి హ‌నుమంతురావు, ముర‌ళీ స‌హ‌కారంతో మెంబ‌ర్స్‌కి సంబంధించిన‌ వివ‌రాలు సేక‌రించి 87 మంది మెంబ‌ర్స్‌కి ఒక్కొక్క‌రికి ఐదు వేల రూపాయ‌లు చొప్పున పంపించ‌గ‌లిగాం. సినిమా ఇండ‌స్ర్టీలోని 24 క్రాప్ట్స్‌కి ఎప్పుడూ ముందుండి వారి గురించి ప్ర‌జ‌ల‌కు చేర‌వేసేది మా సినీ పాత్రికేయ కుటుంబ‌మేన‌ని చెబుతూ మీరు సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి ప‌నుల విష‌యంలో సినీ పాత్రికేయుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!