అక్కినేని నాగేశ్వరరావు సినీ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రం ‘మరో ప్రపంచం’. సుడిగుండాలు చిత్రం తర్వాత ఆదుర్తి సుబ్బారావు తో కొలాబరేట్ అయి చక్రవర్తి సంస్థలో  అక్కినేని నిర్మించిన మరో అభ్యుదయ చిత్రం ఇది. ఈ సినిమా విడుదలై సరిగ్గా 50 ఏళ్ళు పూర్తయింది. మహాత్మాగాంధి శతజయంతి సందర్భంగా కొంతమంది రాజకీయ నాయకులు తమ గొప్ప కోసం ఆయన బాటలో నడవాలనుకుంటున్నామని, ప్రజలకు మంచి చేయబోతున్నామని చెబుతారు. కానీ నిజజీవితంలో వాళ్ళు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. దాంతో కోపంతో రగిలిపోయిన తొమ్మిది మంది యువకులు నగరంలోని చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకుపోతారు. వారికోసం ఒక ప్రత్యేకమైన ప్రపంచం సృష్టించి.. వారికి అక్కడ శిక్షణ ఇస్తుంటారు. మరో పక్క మాయవుతోన్న చిన్నపిల్లల తాలూక తల్లిదండ్రులు పోలీసుల మీద ఒత్తిడి తెస్తారు. దాంతో సిబిఐ ఆఫీసర్ రవీంద్ర (అక్కినేని )రంగంలోకి దిగుతాడు. ఇంతకీ రవీంద్ర తెలుసుకున్న నిజమేంటి? ఆయన చూసిన మరో ప్రపంచం సమాజానికి మేలు చేసేదా? కీడు చేసేదా? లాంటి విశేషాల్ని మరో ప్రపంచం చిత్రం ఆవిష్కరిస్తుంది.

సావిత్రి కథానాయికగా నటించగా.  గుమ్మడి, జమున, పద్మనాభం, సాక్షిరంగారావు, విజయ్ చందర్ సూర్యాకాంతం తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇదే చక్రవర్తి బ్యానర్ లో నిర్మితమైన సుడిగుండాలు చిత్రంతో విజయ్ చందర్ పరిచయమైతే.. మరో ప్రపంచం చిత్రంతో మాడా వెంకటేశ్వరరావు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాదు ఈ సినిమాలో పెదగాంధీ అనే ఒక మంచి పాత్ర కూడా పోషించారు. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమా మంచి అభ్యుదయ చిత్రంగా టాలీవుడ్ చరిత్ర లో నిలిచిపోయింది.

Leave a comment

error: Content is protected !!