మ‌హామ్మారి కరోనా పై యావ‌త్ ప్రపంచం యుద్ధం చేస్తోంది. మ‌న దేశంలో కూడా 21 లాక్ డౌన్ ప్ర‌క‌టించి క‌రోనా నివార‌ణ‌కు అన్ని విధాల కార్య‌చ‌ర‌ణ‌లు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమైత‌న‌ప్ప‌టికీ డాక్ట‌ర్లు, పోలీస్ అధికారులు, హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది పొంచి ఉన్న ప్ర‌మాదాన్ని లెక్క చేయ‌కుండా మ‌నంద‌రి కోసం పని చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు కుటుంబాల్ని వదిలిపెట్టి రోడ్లమీదే తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా.. ప్రజల కోసం కష్టపడుతోన్న తెలంగాణా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి కరోనాను కట్టడి చేసే పోరాటంలో పాలుపంచుకుంటున్న పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబందించి ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక పోలీసు బిడ్డగా పోలీసులు బాధ్యతలు ఎలా ఉంటాయో నాకు తెలుసన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేసారు.

డీజీపీ మాట్లాడుతూ.. ‘మీ లాంటి వాళ్లు నాకు మాత్రమే కాదు. మా పోలీస్ ఫోర్స్ కు మీ మాటలు ఎంతో స్పూర్తినిస్తున్నాయి. మీ లాంటి హీరోల పిలుపు వల్ల చాలా మంది కరోనా పై పోరాటంలో ప్రజలు కలిసి వస్తారని పేర్కొన్నారు. ఒక పోలీసు ఫ్యామిలీ మెంబర్ గా మీకు పోలీసులు బాధ్యతలు ఎలా ఉంటాయో తెలిపినందుకు కృతజ్ఞతలు అన్నారు. మీ మాటలు మీ అభిమానులతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి లాక్ డౌన్ అమలులో పోలీసులకు అందరు సహకరిస్తానని కోరుతున్నట్లు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!