ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. ఇక డాక్టర్లు – నర్సులు – పోలీసులు -మీడియా – పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. కరోనా పై వైద్య సిబ్బంది చేస్తున్న సహకారానికి దేశం మొత్తం ఇప్పుడు సలాం కొడుతోంది. అయితే నిత్యం మనకోసం పోరాడుతున్న వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు సినీనటుడు సోనూసూద్ ముందుకు వచ్చాడు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న తన హోటల్ ని ఇచ్చేశాడు. కరోనా వైరస్ భాదితులకి చికిత్స అందించడానికి వైద్య సిబ్బంది వాళ్లు ఎక్కడినుంచో వచ్చి ఉంటారు.. వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అన్నాడు. వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు అలాగే హెల్త్ వర్కర్స్ వచ్చి ఉచితంగా భోజనాలు చేసి వెళ్లొచ్చు. ఒక్క పైసా కూడా బిల్ చెల్లించనక్కర్లేదు. ఇదీ సోనూసూద్ చేసిన మంచి మనసుతో చేసిన పని. నిజంగా విలన్ చేసిన పనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం మెచ్చుకుంటోంది.
తన హోటల్ ద్వారా ఉచితంగా భోజనం అందించడం చాలా సంతోషంగా ఉందని సోనూసూద్ తెలిపాడు. సోనూసూద్ చేసిన ఈ సహాయానికి సోషల్ మీడియాలో నెటిజన్స్ అభినందిస్తున్నారు. రీల్ స్క్రీన్ లో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో నిజమైన హీరో నువ్వు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక కరోనా పై పోరాటానికి అన్ని ఇండస్ట్రీలోని వారు మద్దతు తెలుపుతూ విరాళాలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం సోనూసూద్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అనడంలో ఆశ్చర్యం లేదు!