ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు తమిళనటీనటులు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్ధిక సాయం చేస్తున్నారు.
తాజాగా కరోనా పై యుద్ధానికి భారీగా విరాళాలిచ్చిన సినీ ప్రముఖుల జాబితాలోకి తమిళ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ , హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ తన వంతు సాయంగా రూ. 3కోట్లు విరాళం ప్రకటించి పలువురి ప్రసంశలు అందుకున్నాడు. అంతేకాదు .. ఈ సందర్భంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తాను చంద్రముఖి 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టుగా ప్రకటించి సౌత్ ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచాడు. ట్విట్టర్ వేదికగా తన విరాళం వివరాలు, రజనీకాంత్ తో తీయబోయే సినిమా విశేషాల్ని షేర్ చేశాడు. ఇక లారెన్స్ ..కరోనా పై వార్ కు ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. 50లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50లక్షలు, తమిళ సినీ పరిశ్రమ కార్మికుల సంస్థకి రూ. 50లక్షలు , డ్యాన్సర్స్ యూనియన్ కు రూ. 50లక్షలు, దివ్యాంగుల సంక్షేమానికి రూ. 25 లక్షలు, తను పుట్టిన ఊళ్లోని ప్రజల సంక్షేమానికి రూ. 75లక్షలు విరాళం ప్రకటించి పలువురి అభినందనలు అందుకున్నాడు.
.@offl_Lawrence contributes Rs 3 Crores for Coronavirus relief fund
50 Lakhs to PM Cares fund
50 Lakhs to Tamil Nadu CM relief fund
50 Lakhs to FEFSI union
50 Lakhs to Dancer's union
25 Lakhs to physical abled
75 Lakhs to daily labour and for people of his birth place #COVID19 pic.twitter.com/xxyeMvUaqC— BARaju (@baraju_SuperHit) April 9, 2020